సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో వైసీపీ కీలక నేత, APఫైబర్ కేబుల్ మాజీ చైర్మెన్ గౌతంరెడ్డికు సుప్రీంలో భారీ ఊరట లభించింది. అతనిపై గతంలో నమోదైన హత్యాయత్నం కేసులో గౌతంరెడ్డికి సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు పలు షరతులను కూడా విధించిన సుప్రీంకోర్టు. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, షరతు విధించింది. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్ష్యులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఫోర్జరీ పత్రాలతో తన తల్లి పేర 2014లో రిజిస్టర్ చేసిన 325 చదరపు అడుగుల స్థలం ని గౌతమ్ రెడ్డి ఆక్రమించడమే కాకుండా, తనను చంపేందుకు 9 మంది వ్యక్తులను పురమాయించారని వారు తనపై ఇంటిపై దాడి కి ప్రయత్నించారంటూ గౌతంరెడ్డిపై విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు అసలు జరిగిన వాస్తవాలుఫై కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో గౌతంరెడ్డికి సుప్రీం బెయిల్ ఇచ్చి అరెస్ట్ కాకుండా ఊరట నిచ్చింది.
