సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణ గుంటూరు జిల్లాల్లలలో వరదల నేపథ్యంలో నేడు, మంగళవారం మాజీ సీఎం జగన్ వైసీపీ పార్టీ సమావేశంలో వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. తాను స్వయంగా గత సోమవారం బాధితులను పరామర్శించినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను రక్షించడంలోను విఫలమయినా లక్షలాది బాధితులకు కనీసం తిండి పెట్టడం మంచినీరు అందించడం లో కూడా విఫలం అయ్యిందని ప్రజలు పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో మన ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వాలంటీర్లు సహకారంతో క్షణాలలో బాధితులకు కావలసిన సహాయం అందించేవారమని, క్యాంపులకు బాధితులను తరలించి చూసుకొనేవారమని, వారు వెళ్ళేటప్పుడు 2 వేలు చప్పున ఆర్ధిక సాయం కూడా అందరికి అందేదని ఇప్పటి బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని, అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. . సీఎం చంద్రబాబు ఫొటోలకు పోజులు ఇవ్వడం కేవలం ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవంగా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు అధికార యంత్రాంగమంతా ఆయనతో ఉంటూ,ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *