సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారము ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి మూర్మ్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతల బృందం కలిసింది. ఏపీలో ఎక్కడ చుసిన టీడీపీ నేతలు దాడులు కు తెగబడుతున్నారు. వైసీపీ నేతల ను తీవ్రంగా గాయపరచి, ఆస్తులు ధ్వసం చేస్తున్నారని , అధికార నేతల ఆదేశాల మేరకు పోలీసులు దాడులపై మిన్న కుంటున్నారని ఫిర్యా దు చేసింది. అనంతరం మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతి ని కోరినట్లు తెలిపారు. ఏపీలో ప్రజాస్వా మ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది’’ మీరు టీడీపీ కార్యకర్తలార్త .. గూండాలా? ప్రమాణస్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారుబాధితుల ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా? రాష్ట్రంలో చట్టం లేదు, సేచ్ఛ లేదు, న్యాయం లేదు. అన్యాయమే రాజ్యమేలుతోంది.అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై రాష్ట్రపతి తగు రీతిన స్వాందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
