సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు , శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు శ్రీ వెంకటేశ్వర దేవాలయాలలో వైసీపీ నేతలు సీఎం చంద్రబాబు లడ్డు లలో ఎటువంటి కల్తీ లేకపోయిన తిరుమల లడ్డు తో వివాదాన్ని రాజేశారని దానికి స్వామి వారు ఆగ్రహం చెందకుండా ప్రజలను క్షమించి కనికరించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా వైసీపీ కీలక నేతలు బొత్సా సత్యనారాయణ, పేర్ని నాని, భూమన కరుణాకర రెడ్డి ,తిరుపతి ఎంపీ గురుమూర్తి మార్గాన్ని భారత్ ,కారుమూరు వెంకట్రెడ్డి తదితరులు శ్రీవారి దేవాలయాలలో ప్రత్యక పూజలలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేసారు. తాజగా నిన్న జగన్ తిరుమల పర్యటన విషయంలో చంద్రబాబు తన క్షుద్ర రాజకీయాన్ని ప్రదర్శిం చారని.. మునుపెన్నడూ లేనివిధంగా డిక్లరేక్లషన్ అంశాన్ని తెర మీదకు తెచ్చారని విమర్శించారు. ఇక ఇదే కీలకమైతే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాప్టిజం తీసుకొన్నానని అంగీకరించారు. మరి క్రైస్తవుడు అయిన ఆయన తిరుమలకు వెళ్లినళ్లి ప్పుడు డిక్లరేక్లషన్ ఇచ్చారా?. పవన్ను ఎందుకు డిక్లరేక్లషన్ అడగరు. మొన్నీమధ్యే హోం మంత్రి అనిత వెళ్లారు. అప్పుడు ఆమె డిక్లరేక్లషన్ ఇచ్చారా?.గవర్నర్ అబ్దుల్ నజీర్ వెళ్లారు.. ఆయన్ను డిక్లరేక్లషన్ను ఎవరు అడిగారు. జగన్ పర్యటన రద్దు కాగానే తిరుమలలోఅప్పటికప్పుడు పెట్టిన డిక్లరేక్లషన్ బోర్డులు తొలగించారు. కేవలం జగన్ మాత్రమే డిక్లరేక్లషన్ ఇవ్వాలా ? అని ప్రశ్నించారు. ఇప్పుడు లడ్డు వివాదం సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది కాబ్బటి అక్కడే అసలు నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానాలు చేసారు. బొత్స అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లో ఇప్పుడు 4 వేల మంది ఉక్కు కార్మికుల ఉద్యోగాలు తొలగించారు మరి వారి గతి ఏమిటి? లడ్డు వివాదం అడ్డు పెట్టుకొని విశాఖ ఉక్కు ను ప్రేవేటీకరణ దిశగా అడుగులు వేయిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *