సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి సర్కార్ తాజా గా నేడు, ఆదివారం కల్తీ మద్యం కేసులో ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేసారు. నేటి. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న సిట్, ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం అరెస్ట్ చేశారు. ఇటీవల కస్టడీలో ఏ1 జనార్ధన్ నుంచి కీలక ఆధారాలు వచ్చాయని అంటూ .. వారి టీడీపీ నేతలు చేసిన తప్పును తనపై రుద్ది తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు.కల్తీమద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు.. ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంంపట్నంలోని ఆయన ఇంటిదగ్గర భారీగా వైసీపీ శ్రేణులు చేరుకొని కాశీ బుగ్గలో 10 మరణాలు నుండి రాష్ట్ర ప్రజలను ద్రుష్టి మరలించడానికి చంద్రబాబు సర్కార్ హైడ్రామా ఆడిస్తుందని వారు నిరసనకు దిగారు
