సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ పార్టీకి ఎంపీ రఘురామా కృష్ణంరాజు రాజీనామా చేసారు.గత 2019 లోక్ సభ ఎన్నికల కు ముందువరకు నరసాపురం లోక్ సభ స్థాననికి తెలుగు దేశం అభ్యర్థిగా ప్రచారంలో ఉండి ఎవరు ఊహించని విధంగా నామిషన్స్ సమయానికి వైసిపి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించిన ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, శనివారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. అయితే రఘురామ తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేస్తానంటూ పలు మారులు సంసిద్ధం వ్యక్తం చేసినప్పటికీ... ఆయన తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకోలేదు. మరో 2 నెలలు లో ఆ పదవి కాలం ఎలానూ ముగిసిపోతుంది. వైసిపి ఎంపీగా గెలిచిన మొదటి ఏడాదిలోనే, రాష్ట్రంలో అధికార పార్టీకి రెబల్ గా మారి ప్రతిపక్షం కన్నా ఎక్కువ గా ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో కారణాలు ఏవైనా.. అనేక కేసులు నమోదు అయ్యి.. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి గత 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ సంక్రాంతి పండుగకు కోర్టు నునుండి చట్టపరమైన రక్షణ తీసుకోని భీమవరం లోని తన నివాసానికి చేరుకొన్న విషయం అందరికి విదితమే.. ఎంపీ రఘురామా పార్టీ అధినేత జగన్ కి రాసిన రాజీనామా లేఖలో.. నాపై మీ శత్రుత్వం, దురుద్దేశపూరిత క్రూరమైన చర్యలు ఉన్నప్పటికీ, గత 3.5 సంవత్సరాలుగా నర్సాపురంలో తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఇక ఈ ఎన్నికలలో నరసాపురం నుండి కూటమి అభ్యర్థిగా మరోసారి బరిలో దిగేందుకు రఘురామా సిద్దపడుతున్నారు.
