సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్.ఆర్.పి అగ్రహారం గ్రామంలో FCI గౌడౌన్ ప్రక్కన .. వైఎస్సార్ పార్టీ జిల్లా నూతన కార్యాలయం నిర్మాణం కోసం నేడు, శనివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో.. ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్లు .. రాజంపేట ఎంపీ, మిదున్ రెడ్డి, మరియు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు శాసనమండలి చైర్మెన్, కొయ్యే మోషేను రాజు ,ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు రంగనాధరాజు, పుష్పాల వాసుబాబు, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్ర ఉండి పార్టీ ఇంచార్జి పివిఎల్ నరసింహారాజూ తదితర నేతలు పాల్గొన్నారు. తదుపరి మంత్రులు భీమవరంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
