సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఆయన బాటలో పట్టణ పార్టీ అధ్యక్షులు తోట బొగ్గయ్యతో సహా పలువురు వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి గ్రంధి శ్రీనివాస్ కు సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో భీమవరంలో మండలి చైర్మెన్ మోషేను రాజు పెద్ద దిక్కుగా.. వైసీపీ నేతల తదుపరి కార్యాచరణ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ని బలోపేతం చేసే దిశగా కొత్త కార్యవర్గం ఎన్నికయింది. వైసీపీ పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు గా గాదిరాజు రామరాజు ఎన్నికయ్యారు. దీనితో ఆయన నేడు, శనివారం భీమవరం గునుపూడిలోని రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలువగా మోషేను రాజు అభినందలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత డా. వేగిరాజు రామకృష్ణం రాజు, వేoడ్ర వెంకటస్వామి, మేడిది జాన్సన్ , కోడే యుగంధర్ బలే యేసు బాబు తదితరులు పాల్గొన్నారు.
