సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వైసీపీ లో మరో కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ని క్వార్ట్జ్ అక్రమాల, గనులలో నిబంధనలకు విరుద్దముగా భారీ పేలుళ్ల పదార్థాల వినియోగం, ఎస్ సి ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కాకాణి ఏ4గా ఉన్నారు. చాల రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నా కాకాణిని పోలీసులు కేరళ రాష్ట్రంలో ?అరెస్ట్ చేసి వెంకటగిరి కోర్టు కు హాజరు పరచగా కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న (ఆదివారం) కాకాణిని పోలీసులు అరెస్ట్ చేసి.. నేడు, సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరికి తీసుకొచ్చారు. విచారణ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వెంకటగిరి కోర్టులో హాజరుపర్చారు. మాజీ మంత్రి కాకాణిని నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
