సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏడాది పాలన పూర్తీ అయిన కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనై ముఖ్యంగా యువతకు నెల నెల నిరుద్యోగ భృతి క్రింద డబ్బు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని , అలాగే లక్షలాది ఉద్యోగాల కల్పన ఏమైందని ప్రశ్నిస్తూ వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు, సోమవారం ప్రకటించిన యువత పోరు కార్యక్రమాలలో భాగంగా భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ యువజన అడ్జక్షుడు జక్కం పూడి రాజా ఆధ్వర్యంలోవైసీపీ నేతలు నగర వీధుల గుండా ర్యాలీ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద కు చేరుకొని అక్కడ నినాదాలతో చేసిన ఆందోళన ఉద్రిక్తలకు దారి తీసింది. అక్కడకు వైసీపీ యువ నాయకులు పెద్ద ఎత్తున చేరటం తో సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఒకానొక దశలో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్ళేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర తోపులాట చోటు చేసుకొంది. దీనితో పోలీసులు వారిపై లాఠీచార్జి కూడా చేసారు. లాఠీ ఛార్జి చేసిన పోలీస్ లపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కలెక్టర్ ను డిమాండ్ చేసారు. మరోవైపు .. కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీలు, కార్మిక సంఘాల నాయకులు కూడా తమ సమస్యలను ప్రబుత్వం పరిష్కరించాలని నిరసన చేపట్టారు. మొత్తానికి ఏలూరు ఇష్యు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియా చేనెల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. భీమవరం లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా స్థానిక వైసీపీ నేతలు చిగురుపాటి సందీప్ ఆధ్వర్యంలో యువత పోరులో విన్నతి పత్రాలు సమర్పించారు.
