సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో మీడియా తో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికి 2025 నూతన సంవత్సరం రాష్ట్రంలో కచ్చితంగా అభివృద్ధి పధంలో నడిపిస్తుందని శుభాకాంక్షలు తెలిపారు. 2024 చాలా హిస్టారికల్ ఇయర్ అని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాకముందు ప్రజలకు బాగా ఇబ్బంది కలిగిందని.. దీంతో జనం సంచలనాత్మక రీతిలో తీర్పు ఇచ్చారన్నారు. మా కూటమి పాలనలో గత ఆరు నెలల్లో జనానికి ఒక హోప్ వచ్చిందన్నారు. తనకు నాలుగవ సారి సీఎం ఆయ్యాక కొత్త అనుభవం ఎదురైందన్నారు.. ‘‘ రాజధాని అమరావతికి చిక్కుముడులు వేశాడు జగన్.. నేను వాటిని విప్పదీసి ట్రాక్‌లో పెట్టాను. పోలవరాన్ని కూడా ట్రాక్‌లోకి తీసుకువచ్చాను అన్నారు. అలాగే ఇటీవల హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల, కు సంబంధించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు ఏది ఏమైనా హైదరాబాద్ ఇప్పుడు హబ్‌గా మారిందని.. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ సినిమాకు బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాలని.. మనకు ఇప్పుడు సినిమా గురించి అంత అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో వైసీపీలో ఉన్నవారు కేవలం షెల్టర్ తీసుకోవడానికి మాత్రమే మా కూటమిలోని మూడు పార్టీల్లోకి వస్తున్నారు. దీనిపై మూడు పార్టీలలో చర్చ జరుగుతుంది. సంకీర్ణం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం’’ అని తెలిపారు.తెలుగు దేశం పార్టీ సభ్యత్వం 94 లక్షలకు చేరిందని హర్షం వ్యక్తం చేసారు చంద్రబాబు. .
