సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై శుక్రవారం కొందరు వ్యక్తులు దాడి చేసిన నేపథ్యంలో దాడిలో గాయపడి ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును గత శనివారం డిప్యూటీ సీఎం పరామర్శించారు‘ ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ వాళ్లే ఈ దాడి చేసారు. దాదాపు 11 మంది వ్యక్తులు దాడి చేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన వారిలో భయం లేదు.. వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా గాలిలో విహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో 11 సీట్లే వచ్చినా అహంకారం తగ్గలేదు’’ ఇంకా అహంకారం తలకెక్కింది. వారిని తోలుతీసి కూర్చోబెడతాం. ఈ కడప జిల్లాలో ఆధిపత్యపు అహకారంతో దాడిచేస్తే మీ అహంకారాన్ని అణిచేస్తాం’’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం త్రికరణశుద్ధితో పనిచేస్తోందని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలా నియంత్రించాలో తెలుసనని వ్యాఖ్యానించారు. ‘జవహర్‌బాబు, ఆయన భార్య అర్చన, కుమార్తె హాన్సి, కుమారుడు వినీత్‌లను పరామర్శించి ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
