సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:: తెలుగు రాష్ట్రాలలో అశేష భక్తకోటికి సుపరిచితులు.. కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి బీజేపీ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నపటికీ హిందూపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ బాలయ్య ఫై పోటీకి నిలిచి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే పరిపూర్ణానంద నేడు, సోమవారం మీడియా తో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసారు. రేపటి ప్రజా తీర్పు లో ఓట్ల కౌంటింగ్ లో నాకు అందిన సమాచారం ప్రకారం .. ఏపీలో వైఎస్ఆర్సీపీ 123 సీట్లు గెలుస్తుందని, వై ఎస్ జగన్మోహనరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ప్రకటించారు. అలాగే తాను పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గం లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగర బోతోందన్నారు. నిబద్ధతద్ధ గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్గ్జి పోల్ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వై యస్ జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని రేపు ఇదే నిజం కానున్నదని అన్నారు.
