సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ కు ఆజన్మ శత్రువుగా మారిన కాంగ్రెస్ పార్టీ లో చేరి, తరుచు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న ఆయన సోదరి షర్మి ల ప్రస్తుతం కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం విదితమే.. అయితే ఆమె కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా షర్మిల సమర్పించిన ఆస్తులు – అప్పుల అఫిడవిట్ వివరాలు వైసీపీ కే కాదు అన్ని రాజకీయ పార్టీల అభిమానులకు షాక్ కు గురిచేస్తోంది. తాజా వార్త సమాచారం ప్రకారం.. విషయం ఏమిటంటే.. తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువను 182.82 కోట్ల రూపాయలుగా ప్రకటించారు షర్మిల. వీటిలో 9 కోట్ల 29 లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టు.. 123 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నట్టు ప్రకటించారు. అఫిడవిట్ లో షర్మిల వద్ద 3 కోట్ల 69 లక్షల రూపాయల బంగారు ఆభరణాలున్నాయి. 4 కోట్ల 61 లక్షల వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు ఉన్నాయి. ఇంతకీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే.. షర్మిలకు ఏకంగా 82 కోట్ల 58 లక్షల రూపాయల అప్పు ఉంది. .ఇంత మొత్తం అప్పు స్వయంగా తన అన్న వై ఎస్ జగన్ నుంచి ఈ అప్పు తీసుకున్నట్టు తన అఫిడవిట్ లో ప్రకటించడం పెద్ద షాక్ అయితే.. అంతకన్నా పెద్ద షాక్ తన వదిన, భారతి నుంచి కూడా 19 లక్షల 56వేల రూపాయలు అప్పు తీసుకున్నట్టు పేర్కొనడం.. ఇంకో దిమ్మ తిరిగిపోయే షాక్ ఏమిటంటే.. జగన్ నుంచి 82 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న షర్మిల.. అందులోంచి 30 కోట్ల రూపాయల్ని తన భర్త అనీల్ కు అప్పుగా ఇచ్చారు. ఇక కేసుల విషయానికొస్తే, షర్మిలపై 8 కేసులున్నాయి. ఈ విషయాలన్నింటినీ తన అఫిడవిట్ లో షర్మిల పేర్కొన్నారు. up file photo..
