సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు మునిసిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి , అసిస్టెంట్ కమీషనర్ ఏ రాంబాబు మరియు మెప్మా CMM డి.శివప్రసాద్, ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరియు RP లకు స్వచ్ఛతా హే సేవ మరియు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి వ్యర్ధాలను ఇంటి వద్దనే హోం కంపోస్టింగ్ చేసుకునే విధానంపై మరియు హోం కంపోస్టు ద్వారా వచ్చిన కంపోస్ట్ ఎరువును టెర్రస్ గార్డెన్ నందు ఏవిధంగా వినియోగించవచ్చో అధికారులు సదరు సభ్యులకు వివరించడం జరిగింది తద్వారా రోజు ఇంటి వచ్చు తడి వ్యర్ధాలను కంపోస్టు ఎరువుగా మార్చుకుని మనకు అవసరమైన కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించుకునే విధానంపై కమిషనర్ వారు అవగాహన కల్పించారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు మనకు ఆరోగ్య రక్షణ రెండు కలుగుతాయని కమిషనర్ తెలిపారు. మరియు సదరు కార్యక్రమంలో హోమ్ కంపోస్టింగ్ తయారు చేసుకొనుట కొరకు అవసరమగు రెండు టిన్నుల చప్పున సభ్యులు కమిషనర్ వారి చేతుల మీదుగా అందరికి సరఫరా చేయడం జరిగింది.
