సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు, గురువారం తన ట్విటర్ లో ఒక సంచలన సినిమా వార్త ప్రకటించారు .( ఇది మన సిగ్మా న్యూస్ లో నిన్ననే వచ్చింది) గత బుధవారం ఏపీ సీఎం జగన్ తో కలసి భోజనం చేసి, దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. మరోసారి జగన్‌కి అనుకూలంగా వర్మ ఓ సినిమా ప్లాన్ చేయబోతున్నాడని, ఆయన రాజకీయ ప్రత్యర్థులను ఓ ఆట ఆదుకునేలా..అందు నిమిత్తమే ఆయనతో భేటీ అనేలా విషయం బయటికి గుప్పుమంది. ఈ విషయంపై తాజాగా వర్మ కూడా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘‘అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్’’ అంటూ వరుస ట్వీట్స్‌తో నిన్న భేటీకి సంబంధించిన వివరాలను వర్మ బయటపెట్టాడు. ఇక చూసుకోండి.. సోషల్ మీడియాలో వర్మ క్రేజ్ .. వారానికో మసాలా ఐటెం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *