సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు ఆధారంగా ఆయన తండ్రి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అతనిని సీఎం కాకుండా అడ్డుకోవడానికి జరిగిన కుట్రలు, ఆయన ఫై కేసులు పెట్టి 16 నెలలు జైలు పాలు కావటంలో కీలక కుట్ర దారులు, బయటకు వచ్చి పార్టీ పెట్టి సీఎం కావడం.. ఇతర రాజకీయ పాత్రల ఆధారంగా వివాదాస్వాద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన కోణంలో ‘వ్యూ హం’ పేరుతో సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి.ఇది రెండు పార్ట్‌లుగా ఆయన తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో జగన్‌పై సినిమా విడుదల చేయాలనేది వర్మ ప్యూహం.. . ఈ రెండు సినిమాల విడుదల తేదీలను వర్మ నేడు, బుధవారం ప్రకటించారు. వ్యూహం సినిమాను నవంబర్‌ 10న, ప్యూహం 2 శపధం మూవీని జనవరి 25న రిలీజ్‌ చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *