సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ సూపర్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం ’తో తెలుగునాట 303 కోట్ల కలెక్షన్ తో ఇండస్ట్రీ రికార్డు హిట్ సాధించిన అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొత్త సినిమా షూటింగ్ నేడు, ఆదివారం ఉగాది సందర్భంగా పూజా కార్య క్రమాలతో ప్రారంభించారు. చిరంజీవి ఫై బ్లాక్ బస్టర్ హిట్ హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టి పూజ కార్యక్రమాలలో పాల్గొనడంతో షూటింగ్ ప్రారంభం అయ్యింది.(పైన తాజా చిత్రం ) అగ్ర నిర్మాతలు అశ్వ నీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్బాబు, దిల్రాజు, నాగవం శీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వా ణ, బాబీ, శ్రీకాంత్ఓదెల, రచయిత విజయేం ద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరు సరసన ఇద్దరు హీరోయిన్స్ తో కుటుంబ కధ చిత్రంగా వచ్చే సంక్రాంతికి విడుదల లక్ష్యంగా తనదైన అనిల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మి త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిరు.. ఇందులో తన అసలు పేరుతో (శంకర్ వరప్రసాద్ పాత్రలో) నటించనున్నారు.
