సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేరళలోని పవిత్ర శబరిమల శ్రీ స్వామి అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త! . ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల నుండి 60 పైగా ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. వచ్చే జనవరి వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇందులో చర్లపల్లి, కాచిగూడ, మచిలీపట్నం, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం నుంచి కొల్లం, కొట్టాయం వరకు సర్వీసులు ఉంటాయి. ఈ ట్రైన్స్ లో ప్రయాణించాలను కునే వాళ్లు.. నేటి నుంచి ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకొనే అవకాశం ఉంది. నరసాపురం నుండి భీమవరం మీదుగా కేరళలోని కొల్లం వరకు శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నెంబర్: 07105 ఈ నవంబర్ 16వ తేదీన బయలు దేరుతుంది. మరల ఇదే ట్రైన్ జనవరి 18వ తేదీన కూడా బయలు దేరుతుంది. మచిలీపట్టణం నుండి ఈనెల 14, 21, 28 తేదీలలో వచ్చే డిసెంబర్ నెల 5, 12, 19 తేదీలలో ప్రత్యేక రైళ్లు బయలు దేరతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *