సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జయాపజయాలు ఎలాఉన్నా మాజీ సీఎం జగన్ కున్న ‘మాస్ పాలోయింగ్’ సినిమా హీరోలకు కూడా ఉండదని ఇప్పటికే పలు సార్లు రోడ్డు షో లలో నిరూపితం అవుతూనే ఉంది. అది మరి స్రుతి మించితే ఎలా ఉంటుందో శబరిమలలో ఆయన అభిమానులు చేసి చూపించారు. స్వామి మాలలో ఉన్న భక్తులకు సర్వము అయ్యప్ప స్వామి మాత్రమే.. అయితే ఇటీవల అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వైసీపీ నాయకులు మాత్రం శబరిమల అయ్యప్ప స్వామిగుడికి కాలినడకన వెళుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బ్యానర్‌ను ప్రదర్శించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కేరళలో పంప నుంచి సన్నిధానానికి వెళుతూ జగన్‌ 2.0 అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించడంతో పాటు ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. పైగా దీన్ని వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *