సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట కూడా క్రేజ్ ఉన్న మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి కి మరో స్టార్ హీరో మోహన్ లాల్ బెస్ట్ ఫ్రెండ్..ఇద్దరు కలసి ఎన్నో సినిమాలు కూడా చేసారు అన్న విషయం కూడా అందరికి తెలిసిందే, అయితే శబరిమలలో ప్రత్యేక పూజల సందర్భంగా మోహన్ లాల్ చేసిన ఓ పని ఈ వివాదానికి దారి తీసింది. దీనిపై కొందరు హిందూ ముస్లీమ్ పెద్దలు మోహన్ లాల్, మమ్ముట్టిలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. విషయంలోకి వస్తే.. . మోహన్ లాల్ నటించిన భారీ సినిమా లూసిఫర్ 2 సినిమా విడుదలప్రమోషన్లలో మోషన్ లాల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే మార్చి 18వ తేదీన ఆయన శబరిమల వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా సినిమా విజయం కోసం ‘ఉష పూజ’ చేయించారు. పనిలో పనిగా తన ప్రియా స్నేహితుడు మమ్ముట్టి పేరు మీద కూడా పూజ చేయించారు. మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ మాముద్ కుట్టి అని, జన్మ నక్షత్రం విశాఖ అని పూజలు చేసే పంతులుకు తెలిపారు. దేవస్థానం ఆఫీస్ నుంచి విడుదలైన రిసిప్ట్ కారణంగా ఈ విషయాలు బయటపడ్డాయి. ఆ రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవిత్ర హిందూ దేవాలయంలో ముస్లిం వ్యక్తి గురించి పూజలు ఎలా చేయిస్తావంటూ కొంతమంది మోహన్ లాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్లతో ఆటలు ఆడుతున్నారా? అంటూ విమర్శలు వస్తున్నాయి. .ఇస్లాం పెద్దలు అయితే ఇస్లాం లా ప్రకారం.. ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యేవారు.. అల్లాను మాత్రమే ప్రార్థించాలని మరి ముమ్మాటి కనుక ఈ పూజ చేయించమని మోహన్ లాల్ ను కోరితే తప్పే నని స్పష్టం చేశారు. ఇక, ఈ వివాదంపై మోహన్ లాల్ ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ పూజలు చేయటం అనేది నా వ్యక్తిగత విషయం. మమ్ముట్టికి ఇటీవల ఆరోగ్యం బాగా లేదని తెలిసి పూజలు చేయించా. ప్రస్తుతం ఆయన బాగా కోలుకుంటున్నారు. అదృష్టమో.. దురదృష్టమో .. ఈ విషయం బయటకు వచ్చింది. మేమిద్దరం ప్రతీ వారానికి ఒకసారి కలుస్తుంటాం. రెండు, రోజులకు ఓ సారి కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటాం అని అయ్యప్ప స్వామి మహిమ వివరించే ప్రయత్నం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *