సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: బంగారం ధరలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఇక సామాన్యుడికి అందుబాటులోకి రావడం కల అని నిర్ధారణ అయ్యింది. ఈ ఏప్రిల్ నెల ఆరంభంలోనే రికార్డు స్థాయిలో రూ.60 వేలు దాటేసిన తులం బంగారం 24 క్యారెట్ల బంగారం ధర నేడు, సోమవారం (ఏప్రిల్ 10 నాటికి) ఉదయానికి 60,860 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏప్రిల్ 1తో పోల్చితే బాగానే పెరిగింది. ఏప్రిల్ 1న 22 క్యారెట్ల బంగారం ధర 55,000 రూపాయలు ఉండగా.. ఏప్రిల్ 10 నాటికి 55,790 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర పది రోజుల్లో తులంపై 790 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఈ పది రోజుల్లో 860 రూపాయలు పెరగడం గమనార్హం. వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఉత్తరాది రాష్ట్రాలలో కిలో వెండి ధర రూ.76,600 రూపాయలుగా పైగా ఉంది. అయితే,తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర 80,200 రూపాయలుగా ఉండటం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *