సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల హీరోగా బాగా వెనుకబడిపోయిన యువ హీరో శర్వా నంద్ గత మూడేళ్లుగా ఫుల్ ఫోకస్‌తో చేస్తున్న సినిమా బైకర్. ఈ సినిమాలో యూత్ లుక్ కోసం శర్వా నంద్ కూడా చాలా సన్నబడ్డాడు. తెలుగు సినిమా లో సరికొత్తగా బైక్ రేసింగ్ నేపథ్యం లో సాగుతుంది ఆ మూవీ. ఈ సినిమా లో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. హీరో ప్రభాస్ మిత్రులకు చెందిన యువి క్రియేషన్స్ సమర్పణలో ఈసినిమా చాల కాలం క్రితమే షూటింగ్ పూర్తీ అయిన పలుమారులు విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల డిసెంబర్ 6న రిలీజ్ అన్నారు. కానీ రిలిజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.. ప్రమోషన్స్ కూడా లేవు… ఇక జనవరి పండుగలలో పోటీ పెడితే థియేటర్స్ కష్టమే.. నెట్ ఫ్లెక్స్ ఓటిటి కి నిర్మాతలు ముందే రైట్స్ అమ్మేయడంతో వారి ఒత్తిడీ పెరగటంతో దీంతో థియేట్రికల్ రిలీజ్ పక్క న పెట్టి.. బైకర్ ఓటీటీ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్ లోనే డైరెక్ట్ రిలీజ్ చేసేలా నిర్మాతల ఆలోచన ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
