సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్ప టికే జియోఫైబర్, Jio Space Fiber పేరున బ్రాండ్ బాండ్ సేవలను అందిస్తున్న జియో తాజాగా నేటి శుక్రవారం నుండి ఆకాశం నుండి శాటిలైట్ నెట్ వర్క్, ఆధారిత ఇంటర్నెట్ సర్వీసులను కూడా ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభించింది. టెకనాలజి రంగంలో ఇదో ముందడుగు.. భారత దేశంలో తొలి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్ ను విజయవంతంగా అమలు చేసినట్లు ప్రముఖ టెలికాం సంస్థ రియలన్స్ జియో ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుసాయంలేని మారుమూల ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ , వినోద కార్యక్రమాలను శాటిలైట్ ఛానెల్స్ ప్రసారాలు ,సేవలను ప్రాంతంతో సంబంధం లేకుండా అందిస్తున్నట్లు పేర్కొంది. తాజా శాటిలైట్ నెట్ వర్క్ జియో ట్రూ5జీ సేవలు సైతం దేశం లోని ప్రతి ప్రాంతానికి అందుతాయి అని రిలయన్స్ జియో ఇన్ఫో కామ్ లిమిటెడ్ ఛైర్మన్, ఆకాశ్ అంబానీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *