సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల కంటే టీవీలలో శాసనమండలి సమావేశాలుకు ఎక్కువ ప్రజాధారణ ఉండటం గమనార్హం. కారణం అందరికి తెలిసిందే.. శాసనమండలికి ఎక్కువ సంఖ్యలో ప్రతి పక్ష వైసీపీ ఎమ్మెల్సీ లు హాజరు కావడం, లెఫ్ట్ పార్టీల సభ్యులు కూడా ఉండటం వారు అడిగే ప్రశ్నలకు టీడీపీ సభ్యులు తక్కువగా ఉన్నపటికీ దాదాపు మంత్రులు అందరు క్రమం తప్పకుండ హాజరు కావడంతో హోరాహోరీ ప్రశ్నలు సమాధానాలతో అగ్రహాలతో సమావేశాలు రంజుగా జరుగుతున్నాయి. చైర్మెన్ గా మోషేను రాజు కూడా బాలన్స్ తప్పకుండ సమర్ధవంతంగా సభను నడుపుతున్నారు. తాజగా నేడు, బుధవారం ఏపీ శాసనమండలి సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే సభ మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లో విఫలం అవుతుందని దీనిపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే సభ ప్రారంభంలోనే ఇది ఎందుకని వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన, తల్లికి వందనం, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, విద్య దీవెన బకాయిల చెల్లింపులపై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతే కాకుండా చైర్మన్ పోడియం వద్దకు కెళ్లి ప్లకార్డులతో నిరసనకు దిగారు .వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. షార్ట్ డిస్కషన్‌లో అన్నీ చర్చిద్దామన్నారు. రూ.4,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారో వైసీపీ సభ్యులు చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారు.. వాళ్లే ధర్నా చేస్తారంటూ మండిపడ్డారు. అయితే మంత్రి లోకేష్ అబద్దాలు చెపితే సరిపోదని వాస్తవాలు చర్చలో తేల్చేస్తామని ప్రతి విమర్శలతో వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ మోషన్ రాజు సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *