సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం , భీమవరం శివారులోని ఎంపీ రఘురామా నివాసంలో జరిగిన రచ్చబండ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లిన తర్వాత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని ప్రజలు అందరు కూటమి మ్యానిపెస్టో కు అందులోని పథకాలకు ఆకర్షితులయ్యారని అది తన ఉండి నియోజవర్గ ప్రచారంలోనే స్వష్టం అయిందన్నారు. పలుచోట్ల సామాన్య మహిళలు తనతోనే స్వయంగా చెప్పారని అన్నారు ఉభయ గోదావరి జిల్లాలలో తమ ఇంటింటికి మంచి నీటి పథకానికి అనూహ్య స్పందన వస్తుందన్నారు. విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు .ఉండి ఆనవాయితీ ప్రకారం కూటమి మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా ఇప్పటికే తన గెలుపు ఖాయం అని అన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థి కాదని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, మరొకవైపు కలిదిండి రామచంద్ర రాజు ఫోటోలను తన పోస్టర్లపై ముద్రించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వామపక్ష భావజాలం కలిగిన పార్టీ అని, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివరామరాజు వామపక్ష భావాలున్న నాయకుల ఫోటోలను తన పోస్టర్లపై ముద్రించికోవాలన్నారు. అంతేకానీ ఇంకా తాను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడునని నమ్మించేందుకు ప్రయత్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శివరామరాజుపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *