సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలం లో శివరాత్రి కి ముందు లక్షలాదిగా వచ్చే భక్తుల ఏర్పాట్లు చూడటంలో గతంలో ఎప్పుడు లేనంత నిర్లక్ష్యంగా వ్యవహించిన దేవాలయ సిబ్బంది. విఐపి ల దర్శనాల కోసం.. క్యూ లైన్ లలో వేలాది భక్తులను పిల్లా పాపలపై కనికరం లేకుండా స్వామి దర్శనానికి పంపకుండా నిలబెట్టిన వైనం, వారికీ కనీసం మంచినీరు పాకెట్స్ కూడా ఇవ్వలేని దౌర్బాగ్యం, సుమారు 200 కిలో మీటర్లు నడిచివచ్చిన సాక్షాత్తు శివ స్వరూపులుగా భావించే దీక్ష లో ఉన్న స్వాములఫై పోలీస్ లతో చేయించిన లాటి ఛార్జ్, ఒకప్రక్క నెత్తిన ఇరుముడి మరో ప్రక్క ఆకలిదప్పులతో నిరసం ఆవహించిన ఆ పరమేశ్వర దర్శనం కోసం తపించిన స్వాములపై ఈ పరమ దుర్మార్గ చర్యకు ఎటువంటి ఓదార్పు, ప్రక్షాళన జరగలేదు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ వీడియోలు చుసిన ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా స్వాదించారు.బాధపడ్డారు. ఈ ఉద్రిక్తతల’ నేపథ్యంలోరాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ఇప్పటికి కాస్త స్వాందించింది శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్‌ను (ఐఎ్‌ఫఎస్) బదిలీ చేస్తూ గత శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.మరి ఈవో, దేవాదాయ శాఖ మంత్రులు మాటేమేమిటి ?హుండీలో భక్తులు వేసే కోట్ల రూపాయల కానుకలే కావాలా?దేవాలయాలలో సామాన్య భక్తుల సౌకర్యాలపై పై శ్రద్ద పెట్టలేరా?ఆధ్యాత్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు ప్రశ్నిస్తున్నారు.
