సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం ఈ శీతకాలంలో సైతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీని ప్రభావం తో ఈనెల 9వ తేదీ నుంచి తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ,కృష్ణ, NTR, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.
