సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శుభప్రదాయిని నిజ శ్రావణమాసం నేటి గురువారం నుంచి ప్రారంభం అయ్యింది. నెల రోజులపాటు భగవన్నామ స్మరణ లతో తెలుగు లోగిళ్లు మారు మోగనున్నాయి. నోములు, వ్రతాలు, పూజలు, ఉపవాసాలతో మహిళలు తమ భక్తి ప్రవత్తులను చాటనున్నారు. పూజాసామాగ్రి, కొబ్బరి, అరటి పళ్ళు , పుష్పాలు అమ్మే వ్యాపారులకు, అర్చికులకు , కళ్యణ మండపాలకు,డెకరేషన్ వారికి, భాజా భజంత్రీల వాళ్లకు మంచి గిరాకీ ఉంటుంది. రెండు నెలల విరామం తర్వాత ఈ నెల 19 నుంచి డిసెంబరు 31 వరకు సుమారు 53 మంచి ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, శుభకార్యాలు జోరందుకోనున్నాయి.ఈ ఆగస్టులో 19, 20, 22, 24, 26, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. వచ్చే సెప్టెంబరులో 1, 2, 3, 6, 7, 8 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఈనెలలో 18న మొదటి శుక్రవారం నుంచి ప్రతీ శుక్రవారం మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతాలను ఆచరిస్తారు. 25న వచ్చే రెండో శుక్రవారాన్నే వరలక్ష్మీ వ్రతంగా ఆచరిస్తారు.ఈ మాసంలో .. నాగుల పంచమి. మంగళ గౌరీవ్రతం, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ సోమవారం, శ్రీకృష్ణ జన్మాష్టమి, సంకట హర చతుర్థి, పోలాల అమావాస్య ప్రాచుర్యం పొందిన పండుగలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *