సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ఎందరో సినీ హీరోలు అందులో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు వేరు.. అది మరోసారి రుజువు చేస్తూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కి చెందిన బవిరిశెట్టి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఎన్నో దశాబ్దాలుగా సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని .. టౌన్ లో గత 30 సంవత్సరాల నుంచి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. మురళీకృష్ణ జంగారెడ్డిగూడెంలో జ్యూస్ సెంటర్ నడుపుతుంటారు. ఆయన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. సూపర్ స్టార్ ఫ్యామిలీకి ఆయన ప్రత్యేక ఆహ్వానం అందిస్తారు. అంతేకాదు, ఆహ్వాన పత్రిక అన్నివైపులా పై కృష్ణ, మహేష్ బాబు ఫొటోలను కూడా ముద్రించడం ఆనవాయితి.. మొదటి ఇద్దరు కొడుకులు సంసారాలు చక్కగా ఉన్నాయి.. కలిసొచ్చింది, ఇప్పడు హీరో కృష్ణ లేరు.. అయినప్పటికీ .. మురళీ కృష్ణ ఇంటిలో శుభకార్యం జరుగుతోంది. తన మూడవ కుమారుడి వివాహానికి ఈసారి ఆహ్వాన పత్రిక అందుకునేందుకు సూపర్ స్టార్ కృష్ణ లేకపోవడంతో.. ఎంతో బాధగా ఉందని అయినప్పటికీ ఆయన ఆశీస్సులు మాత్రం ఎప్పటికీ తన ఫ్యామిలీకి ఉంటాయని అంటున్న మురళీ కృష్ణ.. కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికను( అంత కృష్ణ బొమ్మలే..) కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరిరావుకు అందజేశారు..ఇలాంటి అభిమానులను పొందిన సూపర్ స్టార్ కృష్ణ ధన్యుడు అనాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *