సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రం గా విడుదలై యువతకు బాగా కనెక్ట్ అయ్యి బాక్సా ఫీస్ వద్ద 70కోట్ల కలెక్షన్స్ సాధించి భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 14న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైష్ణవి, ఆనంద్ దేవరకొండల నటన అందరినీ కట్టిపడేసింది. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ‘బేబీ’ స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా’ అంటే అందరికీ ఇష్టం . రేపు (శుక్రవారం ) బేబీ మూవీ అప్డేట్ ఇస్తాం ’’ అని పేర్కొంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు 24 లేదా 25వ తేదీల్లో స్ట్రీమింగ్ రావచ్చు అని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *