సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శుభవార్త.. ఇకపై రైలు ప్రయాణికులకు రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి సెంట్రల్ రైల్వే.. మొదటిసారిగా ముంబయి-మన్మాడ్- పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లో ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు చెప్పారు. త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్నిదేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రైలు కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్ డోర్ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.
