సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో తమకు ఇష్టమైన కోర్స్ లను ఎంపిక చేసుకొనే విద్యా ర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోఎం బీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించిన బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లను ఏపీ విద్యా ర్థులకు రిజర్వ్ చేస్తూ అడ్మి షన్ల నిబంధనలు సవరించింది. ఈ మేరకు వైద్య , ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృ ష్ణబాబు ఉత్తర్వు లు జారీ చేశారు. కొత్త కాలజీలకు అనుమతులతో కలపి రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ , 15 ప్రైవేట్, 2 మైనార్టీ మెడికల్ కాలేజీలు ఉన్నా యి. ప్రైవేట్ కాలేజీల్లో 2,450 ఎం బీబీఎస్ సీట్లు ఉండగా.. ఈ ఏడాది రెండు ప్రైవేట్ వైద్య కళాశాలల్లోఒక్కో కాలేజీకి 50 చొప్పున 100 సీట్లు పెరిగాయి. మరోవైపు తిరుపతి జిల్లా రేణిగుంటలో శ్రీబాలజీ మెడికల్ కాలేజీలో అడ్మి షన్లకు అనుమతులు లభించాయి. ఇక్క డ 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రైవేట్ కాలేజీల్లో 2,700 ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరం అందుబాటులో ఉం టాయి. ఇందులో బీ కేటగిరీ కింద 35శాతం అంటే 945 సీట్లు ఉన్నా యి. గత ఏడాది వరకూ వీటికి అన్ని రాష్ట్రాల విద్యా ర్థులు అర్హులుగా ఉన్నా రు.తాజా సవరణ మేరకు బీ కేటగిరీలో సీట్లలో 85 శాతం సీట్లు అం టే సుమారు 804 సీట్లు ప్రత్యేకంగా ఏపీ విద్యా ర్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యా ర్థులు పోటీ పడతారు. ఓపెన్ కోటాలోనూ మనరాష్ట్ర విద్యా ర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఇంకా పూర్తీ వివరాలు కోసం 89787 80501, 79977 10168, సెల్ నంబర్లలోను, ఫీజు చెల్లిం పు కోసం 83338 83934లోనూ సం ప్రదిం చాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *