సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజల అవసరాల కోసం దశాబ్దాలుగా పెద్ద సమస్యగా ఉన్న డంపింగ్ యార్డ్ ను తాను సాధించినట్లు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తాజాగా ప్రకటించారు నేడు, గురువారం తాడేరు గ్రామంలో మీడియా కు 6 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని చూపించారు. గతంలో నేను 2004 లో ఎమ్మెల్యే గ ఉన్న హయాంలో వేసవిలో పట్టణ ప్రజలు పడుతున్న బాధలు చూసి మంచినీటి చెరువు కోసం ఏకంగా 126 ఎకరాలు కొనుగోలు చేసి 65 ఎకరాలలో కోట్ల రూపాయల ఖర్చుతో ట్యాంక్ కూడా నిర్మించామని అదే ప్రజల దాహార్తిని తీరుస్తుందని , ఇప్పుడు తాడేరు ప్రాంతంలో 8000 పైగా పేదల కోసం టిడికో ఇళ్ళు పూర్తీ చేస్తున్న 82 ఎకరాల స్థలాన్ని నేను ఎమ్మెల్యే గా ఉన్నపుడు కొనుగోలు చేసి చేసిందేనని ,నియోజకవర్గంలో ఏకంగా 10 వంతెనలు నిర్మించామని తరువాత టీడీపీ వారి హయాంలో అభివృద్ధి శున్యం అని అప్పటి ఎమ్మెల్యే (అంజిబాబు..?) చిన్నమిరంలో రైతులను మంచి నీటి పధకం చెరువు తవ్వుతానని చెప్పి 40 నుండి 50 ఎకరాలు కావాలని చెప్పి వాటిని తన పేరున కొనుగోలు చేసి మోసం చేసారని, ఎక్కడ చుసిన స్వార్ధం.. టీడీపీ ప్రభుత్వం పేరు చెప్పి ప్రజలను మోసగించడం తప్ప చేసిందేమి లేదని అన్నారు. ఇప్పడు జనసేన అడ్జక్షుడు, భీమవరంలో వర్షం కురుస్తున్నపుడు పేదలకు ఇచ్చిన స్థలాల్లో నీటిలో నడుస్తూ అర్ధ జ్ఞానం తో తమను వెటకారం చెయ్యడం తప్ప ఆయన గతంలో టీడీపీ చైర్మెన్ గా చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు.మొన్న’పప్పు’ పాదయాత్రలో కూడా తనను కంపోస్ట్ యార్డ్ కూడా సాధించలేని ఎమ్మెల్యే అన్నాడని.. నిజానికి కుట్రలు చేసే వాళ్ళు కోర్ట్ కేసులు వెయ్యకుండా.. మునిసిపల్ చెత్త వెయ్యడానికి ఎవరికీ ఇబ్బంది లేని ఈ 6 ఎకరాల 60 సెంట్ల స్థలాన్ని ఏడాది క్రితమే ప్రభుత్వ ధర కన్నా 2 రేట్లు ఎక్కువ ఇచ్చి కొనుగోలుచేశామని, సహకరించిన రైతులకు దండం పెడుతున్నానని అన్నారు. దీనికి 70 లక్షలతో రోడ్డు వేసి కంపోస్ట్ యార్డ్ గా వినియోగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల భీమవరం మండల ఎంపీపీ పేరిచర్ల నరసింహరాజు, తదితర వైసిపి నేతలు అధికారులు పాల్గొన్నారు.
