సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం పదో తరగతి అర్హతపై భారీగా ఉద్యో గాల భర్తీకి కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు శాఖల్లో దాదాపు 11,409 మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (MTS), హవల్దార్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. వీటిలో దాదాపు 10,880 పోస్టులు మల్టీ టాస్కింగ్ సిబ్బంది కాగా.. 529 హవల్దార్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొనేందుకు తుది గడువు ఫిబ్రవరి 17 రాత్రి 11గంటల వరకు ఇచ్చింది. అలాగే, ఫీజు 100 రూ. చెల్లింపునకు మాత్రం ఫిబ్రవరి 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఏప్రిల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుందని ఎస్ఎస్సీ ప్రకటించింది. ఎంటీఎస్ ఉద్యోగాలకు వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్లు కాగా.. హవల్దార్ ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి27 ఏళ్లు మించరాదని పేర్కొం ది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం ,విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షా కేం ద్రాలను ఏర్పాటు చేసిన ఎస్ఎస్సీ అధికారులు.. తెలంగాణలోని హైదరాబాద్; కరీంనగర్, వరంగల్ సీబీటీ పరీక్ష రాసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సీబీటీ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. తెలుగుతో పాటు మరో 12 ప్రాంతీయ భాషల్లోనూ ఈపరీక్ష రాసేందుకు అవకాశం కల్పి స్తున్నారు.
