సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బంగారం (gold), వెండి (silver) కొనుగోలు దారులకు శుభవార్త… ఇటీవల దీపావళికి ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు సోమవారం (నవంబర్ 11న) ఉదయంనుండి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 350కి చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 79, 500కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 72, 890కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 350కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72, 740కి చేరింది. వెండి ధరలు కేజీకి వంద రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్‌లో రూ. 79, 350, రూ. 72, 740 విజయవాడలో రూ. 79, 350, రూ. 72, 740 కు అందుబాటులో ఉన్నాయి.
