సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అన్ని ధరలు పెరిగిపోతుంటే గోదావరి జిల్లాలో మాత్రం జీడి గింజల ధర భారీగా దిగివచ్చింది. . గత మార్చి, ఏప్రిల్ నెలల్లోరైతుల వద్ద 80 కేజీల జీడి గింజల బస్తాను ( జీడిపప్పు వేరుచెయ్యకుండా టోకుగా)వ్యా పారులు రూ.9,500కు కొనుగోలు చేశారు. ఈ ధర గత మే నాటికి రూ.7,500కు తగ్గింది. ఇప్పడు 7000 కు దొరుకుతుంది. ఇందులో క్వాలిటీ తక్కు వగా ఉండే చివరి రకం జీడి గింజలు రూ.4,000 కు కూడా లభిస్తున్నాయి, విశాఖ ఏజెన్సీ , గోదావరి జిల్లాల లోని రైతులలో ఆందోళన కనిపిస్తుంది. ప్రజలకు రిటైల్ ధర కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. ఉదాహరణకు 2 నెలలు క్రితం భీమవరం మార్కెట్లో జీడీ పప్పు మంచి క్వాలిటీ కేజీ 800 ధర అయితే ఇప్పుడు 530 – 600 ధరకు లభ్యమౌతుంది. క్వాలిటీ తక్కువ ఉన్న జీడీ పప్పు మరింత తక్కువ ధరకు లభ్యం అవుతుంది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజోలు, మోరి, మల్కిపురం , నరసాపురం నియోజకవర్గాల్లోని సముద్ర తీరంలో జీడిమామిడి సాగు జరుగుతోంది. మలికిపురం మండలం మోరి గ్రామం జీడి పప్పు తయారీ ప్యాక్టరీ లకు ప్రసిద్ధి పొందింది. జీడితోటలు కాపు మీద ఉన్న సమయంలో అదనం గా వర్షాలు కురిశాయి. దీం తో మరోసారి పూత పూసి, జీడి గిం జల ఉత్ప త్తి బాగా పెరగటంతో ధర పతనం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *