సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే.. కాస్త కూరగాయల ధరలు మాత్రం దిగివస్తున్నాయి. తాజగా అందిన సమాచారం ప్రకారం.. వంట నూనె ధరలు తగ్గనున్నాయి . విదేశీ మార్కెట్లలో నూనె గింజల ధరలు పెరిగినప్పటికీ, దేశీయ మార్కెట్లో పలు రకాల నూనె గింజల ధరలు తగ్గిపోయాయి. గత శుక్రవారం, దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని నూనె గింజల ధరలు పెరిగాయి. కానీ దిగుమతిదారులు దిగుమతి చేసుకున్న సోయాబీన్ డీగమ్ ఆయిల్‌ను దిగుమతి ఖర్చు కంటే 4-5 శాతం తక్కువ ధరకు అమ్ముతున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,892గా ఉంది. కానీ స్పాట్ మార్కెట్‌లో ఈ ధర 15-18 శాతం తక్కువగా, అంటే క్వింటాలుకు దాదాపు రూ. 4,000కి అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు పొద్దుతిరుగుడు పంట MSP కంటే 20 శాతం తక్కువ ధరకు దిగివచ్చింది. వేరుశనగ పంట కూడా MSP కంటే 22-23 శాతం తక్కువ ధరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లీటర్ 145 రూపాయల వరకు రిటైర్ మార్కెట్ లో అమ్ముడుపోతున్న సన్ ఫ్లవర్ ఆయిల్స్ దాదాపు 15-18 శాతం పైనె ఈ వారంలో ధరలు దిగి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇతరాత్ర ఆయిల్స్ కూడా ధరలు దిగి రానున్నాయి.
