సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో పేదలకు శుభవార్త.! కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్లు నిర్మించాలని నిర్దేశించారు. సీఎం చంద్రబాబు తో సమీక్ష తరువాత గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియా తో మాట్లాడుతూ.. ఇకపై రాష్ట్రంలో కొత్త పేద లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సర్కారు ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేయని భూముల్లో ఇళ్లస్థలాలు పొందని పేదలకు కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిశ్చయించాం. జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని సీఎం ఆదేశించారు’ అని అన్నారు.
