సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 3 ఏళ్ళ క్రితం లీటర్ కేవలం 80 రూపాయలు పైబడి దొరికే వంట నూనెలు కరోనా సమయంలో వంట నూనెలు అడ్డుఅదుపు లేకుండా లీటర్ 200 రూపాయలు దాటెయ్యడం ప్రజలు చూసారు. అయితే గత 6 నెలలుగా మెల్లగా వంటనూనెల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత నెల డిసెంబరులో సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ లీటరు ప్యాకెట్‌రూ.150-రూ.155 మధ్య విక్రయించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన నూనె ధరలు.. ఇప్పుడు ఉక్రెయిన్ చాల మటుకు రష్యా ఆధీనంలోకి రావడం తో పరిస్థితి మెరుగు కావడం, అవసరమైనంత పరిమాణంలో నూనెలు కంటెయినర్ల ద్వారా వస్తుండడంతో టోకు వ్యాపారులు ధరలు తగ్గించక తప్పలేదు. ఆ మేరకు జనవరి మొదటి వారం నుంచే నగరంలో వీటి రేట్లు తగ్గాయి. ఫ్రీడమ్ సన్ ప్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్‌పై పది రూపాయలు తగ్గింది. దీని ధర మార్కెట్‌లో రూ.142గా నిర్ణయించారు. అయితే కొన్ని కొత్త కంపెనీలు 134 రూపాయలకు అందుబాటులో ఉంచడం విశేషం.. అయితే కొందరు రిటైల్ వ్యాపారులు, సూపర్ మార్కెట్‌లలో ఇంకా రూ.150 చొప్పునే అమ్ముతున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ రేటు మరింత తగ్గే అవకాశం వుందని హోల్ సెల్ వ్యాపారులు చెబుతున్నారు. రేపు, బుధవారం నుంచి కొత్త రేట్లు వస్తాయని, లీటరుకు ఐదు రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది, వినియోగదారులు ఇది గమనించి కొనుగోలు చెయ్యాలి.
