సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. ట్రైన్‌లో ప్రయాణించే జనరల్ కోచ్‌లో ఉన్నవారికి సదుపాయాలు అంతగా ఉండవు. వారు తక్కవు ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకుంటారు. అందుకే ఇప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని ఇకపై దేశంలోని 100 రైల్యే స్టేషన్స్ లో జనరల్ కోచ్‌లో ప్రయాణించేవారి కోసం 150 ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. రైల్వేశాఖ. అక్కడ కేవలం రూ.20కే ఆహారాన్ని అందించనుంది. దాంతో పాటూ తారునీరును కూడా కేవలం 3.రూల కే ఇవ్వనుంది. రూ.20కి అందించే ఎకానమీ మీల్స్‌లో 7 పూరీలు, బంగాళ దుంపల కూర, పచ్చడిని ఇస్తారు. అదే రూ.50కి అందించే మీల్లో అయితే అన్నం, కిచిడీ, ఛోలే-కుల్చే, ఛోలే-భటూరే, పావ్ భాజీ, మసాలా దోశల్లో ఒక దానిని తీసుకోవచ్చు. ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా ఉత్తర దక్షిణ భారత దేశంలోని వంద స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో సక్సెస్ అయితే దేశంలో అన్ని స్టేషన్లలోనూ ఏర్పాటు చేస్తారు..
