సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 5 రాష్ట్రాలలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు, బుధవారం సమావేశం అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ అంశాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ లోని నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీర్మానం.జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌పై మరో రూ.100 సబ్సిడీ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే గత నెలలో తగ్గించిన 200 రూపాయలకు తోడు ఇప్పుడు మరో 100 తగ్గటంతో 14న్నర కేజీల గ్యాస్ సిలండరు సుమారు 800 రూపాయల.. ధరకే అందుబాటులోకి వస్తుంది..
