సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విద్యుత్ సబ్సిడీ కోసం ఉద్యమించిన భీమవరం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యలు, చేపల వ్యవసాయం చేసే రైతులకు శుభవార్త! మత్యశాఖ కమిషనర్ కే కన్నబాబు తాజగా ప్రకటించిన వివరాల ప్రకారం సీఎం జగన్ ఆదేశాల మేరకు…..విద్యుత్ యూనిట్ కొచ్చి కేవలం రూ 1-50 కే అందిస్తున్న ప్రభుత్వ సబ్సిడీ ఇకపై అసైన్డ్, ప్రభుత్వ , దేవదాయ భూముల్లోపదెకరాల్లోపు రైతులకు వర్తింపు జరుగుతుందని రాష్ట్ర కమిటీ ఆమోదంతో త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రకటించారు. దీనితో నాన్ ఆక్వా జోన్లలో అర్హమైన ఆక్వా జోన్ ప్రాంతాల గుర్తింపులో అధికారులు ఉన్నారు. ఇప్పటి వర్కౌ ఆక్వా జోన్ పరిధిలో పదెకరాల్లోపు ఆక్వా సాగుచేసే రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్న ప్రభుత్వం మరింతమందికి లబ్దిచేకూర్చాలని సంకల్పించింది. జోన్ పరిధిలో అసైన్డ్ భూములతో సహా వివిధరకాల ప్రభుత్వ భూముల్లో రొయ్యలు, చేపలు సాగుచేస్తున్నవారితోపాటు దేవదాయ భూములను లీజుకు తీసుకుని సాగుచేస్తున్న రైతులలో పదెకరాల్లోపు వారికి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది.
