సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోవంట గ్యాస్ కష్టాలు తెలిసిందే, అయితే అందరికి అందుబాటులో 5 కేజీల సిలెండర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే 5 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరమే లేదు. కేవలం ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. ఎటువంటి బుకింగ్ లేకుండా మీ సమీపంలోని మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అయినా అప్పటికప్పుడు దీనిని తీసుకుని వెళ్లవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛోటు పేరుతో 5 కేజీల సిలిండర్ లాంచ్ చేసింది. పెట్రెల్ పంపుల్, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇండేన్ పంపిణీదారుల వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు. ఏ నగరంలో అయినా దీనిని వినియోగించుకోవచ్చు. ఇక భారత్ గ్యాస్ మినీ సిలిండర్ అయితే మీ ఇంటి వద్దకే వచ్చేస్తుంది. 1800224344 నెంబర్‌కు కాల్ చేస్తే రెండు గంటల్లోనే మీ ఇంటికి డెలివరీ చేస్తారు . అయితే రూ.25 డెలివరీ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది. ఇక హెచ్ పీ గ్యాస్ అప్పు పేరుతో 5 కేజీ ల సిలిండర్ ప్రవేశపెట్టింది. పెట్రోల్ బంక్‌లు, విక్రయ కేంద్రాలు, కిరాణా దుకాణాల్లో దీనిని పొందే అవకాశం కల్పించారు.
