సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలో 8 కిమీ దూరంలో ఉన్న శృంగవృక్షం గ్రామంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడం తో నేటి ఉదయం 10న్నర గంటల సమయంలో ట్రాఫిక్ స్తంభించింది. భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారి పీపీ రోడ్ కావడంతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని వాహహానాలను దారి మళ్లించారు. నిత్యం భీమవరానికి వేలాది మంది చుట్టుపక్క గ్రామాల నుంచి ఉపాధికి వస్తూ ఉంటారు. ఇటీవల కాలంగా శృంగవృక్షామ్ రైల్వే గేట్ తరుచు ఇబ్బందులు పెడుతుండటంతో కొన్ని గంటల పాటు తెరుచుకొని పోకపోవడం తో ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *