సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం సమీపం లో 8 కిమీ దూరంలోని శృంగవృక్షంలోని రైల్వే గేటు పలు సార్లు మొరాయించడంతో ప్రతి రోజు ప్రధాన రహదారి పిపి రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికే పలు మారులు రైల్వే సిబ్బంది ఈ గేటుకు రిపేర్ చేసినప్పటికీ గత మంగళవారం ఉదయం రైలు వెళ్లిన తరువాత గేటు తీసే క్రమంలో ఒక వైపు గేటు పైకి లేవకపోవడంతో 2 కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ ట్రాక్ మధ్య భాగంలో గ్రావెల్ లేచిపోయి గుంటలు ఎక్కువ కావడంతో ట్రాక్ మధ్య రహదారి మలుపు సరిగా లేకపోవడం వల్ల వాహనదారులు తమ వాహనాలకు ఆచితూచి నడపాలి. దానికి తోడు ఈ గేటు చాలాసార్లు ఈవిధంగా జరుగుతున్నా రైల్వే అధికారులు శాశ్వత పరిష్కారం చెయ్యలేకపోతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం పాలకొల్లు రైల్వే గేటు కూడా ఇదే తరహాలో తిప్పలు పెట్టిన ఆ సమస్య ఇప్పుడు లేకుండా పోయింది.
