సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిఫరెంట్ సినిమాల దర్శకుడు గా కధ ఎటువంటిదైనా సినిమాను చాల కూల్ గా తీసే సినీ దర్శకుడు, శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘ కుబేర’ సినిమా ను అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తమిళ హీరో ధనుష్, రష్మిక లతో సైలెంట్ గా షూటింగ్ పూర్తీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా నాగార్జున ఫై ఫస్ట్ లుక్ రిలీజైంది, ఈ లుక్ లో నాగార్జున నడివయ్యస్సు ఉన్న దర్యాప్తు అధికారిగా సింపుల్గా ఉన్నాడు. జోరుగా వర్షం కురుస్తుంటే.. ఓ కంటైనర్ నిండా ఉన్న డబ్బు దగ్గర నాగార్జున నిలబడి ఉన్న సన్నివేశాన్ని కొంత సస్పెన్సు మేళవించి ఫస్ట్ లుక్ వీడియోలో చూపించారు. వర్షానికి ఒక కరెన్సీ నోటు రోడ్డుపై పడి తడిచి పాడైతే.. ఆ స్థానం లో తన సొంత డబ్బు ను పెట్టి తన నిజాయితీని చాటుకుంటాడు నాగ్. ఈ షాట్ లో శేఖర్ కమ్ముల టెస్ట్ కనిపించింది. ధనుష్ ఒక సర్వ కోరికలు వదులుకొన్న యోగి తరహా పాత్రలో కనిపిస్తుండటం విశేషం,ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇప్పటికే బ్యాంకాక్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *