సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో రెండు రోజుల్లోనే శ్రావణం.. ఈనెల 5 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి భారీగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. నిజానికి ఈఏడాది గత మార్చి నెల నుండి శూన్యమాసం కారణంగా ముహూర్తాలు లేవు..మూడు నెలల విరామం తర్వాత ముహూర్తాలు భారీగా ఉండడంతో పెళ్లి సందడి నెలకొంది. ప్రధానంగా ఈ నెలలో 7, 8, 9, 10, 13, 15, 17, 18, 19, 22, 23, 24 తేదీలు వివాహాలకు అత్యంత అనుకూలమని పంచాంగ పండితులు ప్రకటించారు. వీటిలో అత్యంత బలమైన ముహుర్తాలుగా 17, 18, 22, 23 తేదీలను పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయా తేదీల్లో కల్యాణ మండపాలకు యమ డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యముగా జిల్లా కేంద్రం భీమవరంలో కల్యాణ మండపం దొరకడం గగనమైపోతోంది. అసలు వర్షాకాలం కావడంతో కల్యాణ మండపం తప్పనిసరిగా మారింది. ఇక్కడ పెళ్లిళ్ల పేరున వందల కోట్లాది రూపాయలు వ్యాపారం జరుగుతుంది.భీమవరంలో పెళ్లిళ్ల వైభోగం తెలుగు రాష్ట్రాలలోనే హైలైట్ గా నిలుస్తాయి మరి.. రాష్ట్రంలో తిరుపతి తర్వాత ద్వారకాతిరుమలలో,అన్నవరంలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతంటాయి. ఇక భారీ ఎత్తున పెళ్లిళ్లు చేయడానికి వధూవరుల కుటుంబాలు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. నగలు, వస్త్రాలు, వ్యాపారులకు మంచి సీజన్ ఇది. అలాగే కల్యాణ మండపాలు, పూల డెకరేషన్ చేసేవారికి ,సన్నాయి, బ్యాండ్, కేటరింగ్‌కు డిమాండ్‌ ఏర్పడింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *