సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలు లో శ్రావణ మాసం రావడంతో శుభకార్యాలకు వివాహాలకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో లక్షల్లో పెళ్లిళ్లు గృహప్రవేశాలు జరుగుతున్నాయి. గతంలో మూఢం, ఆషాఢం కారణం గా గత 48 రోజుల పాటు శుభకార్యాలు జరగలేదు. దీంతో బంగారం, ఆభరణాల షాపులు వెలవెలబోయాయి. వస్త్ర దుకాణాలు, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి.చాల మందికి పని, బిజినెస్ లేకుండా పోయింది. కానీ… శ్రావణం వస్తూనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయా తేదీల్లో కల్యాణ మండపాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యముగా జిల్లా కేంద్రం భీమవరంలో కల్యాణ మండపం దొరకడం గగనమైపోతోంది. అసలే వర్షాకాలం కూడా కావడంతో కల్యాణ మండపం తప్పనిసరిగా మారింది. ఇక్కడ పెళ్లిళ్ల పేరున వందల కోట్లాది రూపాయలు వ్యాపారం జరుగుతుంది. భీమవరంలో పెళ్లిళ్ల వైభోగం తెలుగు రాష్ట్రాలలోనే హైలైట్ గా నిలుస్తాయి మరి.. రాష్ట్రంలో తిరుపతి తర్వాత ద్వారకాతిరుమలలో,అన్నవరంలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతంటాయి. ఈ. జులై 31, ఆగస్టు 1, 3, 5 తారీఖుల్లో మంచి బలమైన ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు ఏడు నుంచి 17వ తారీఖు వరకూ బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఒక ,సెప్టెంబర్ చివరి వారమంతా బలమైన ముహూర్తాలున్నాయి. అలాగే, అక్టోబర్‌లో మూడో వారం మినహాయించి మిగతావన్నీమంచి శుభ దినాలు ఉన్నా యి. నవంబర్‌లో కూడా చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వరుస ముహూర్తాలు కారణం గా పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, డ్రోన్స్, వంట వాళ్ళు , పుష్పాలంరణ కళాకారులు, టెంట్‌హౌస్‌లు, విద్యుత్ దీపాలంకరణలకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. సన్నాయి, బ్యాండ్, ఆర్కెస్ట్రా కళాకారాలకు నవంబర్ మాసాంతం వరకూ చేతి నిండా పని ఉంది.
