సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు.. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రావణ మాసం 5 శుక్రవారములు వచ్చిన సందర్బంగా భక్తుల కోరిక మేరకు ఈనెల 22వ తేదీ 5 వ శుక్రవారం రోజు కూడ సామూహిక వరలక్ష్మి వ్రతములు నిర్వహించబడునని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. ఈ వ్రతములు 600 మంది భక్తులకు మాత్రమే నిర్వహించ బడునని మరియు మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతగా అవకాశం కల్పించ బడుచున్నందున.. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోదలచిన మహిళా భక్తులు శ్రీ అమ్మవారు సన్నిధిలో ఉదయం 7.00 గంటలకు ముందు హాజరుకావాలని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
